గడప గడపకు కాంగ్రెస్ పార్టీ, పల్లె పల్లె కు విజ్జన్న
పెద్దపల్లి, ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి నియోజకవర్గంలోని, ఎలిగేడు మండలములోని ముప్పరితోట (మల్లయ్యపల్లి )గ్రామంలో, హథ్ సే హథ్ జోడో కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పల్లె పల్లె కు విజ్జన్న 4 వ రోజు పాదయాత్ర చేపట్టిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ రావు.
ఈ సందర్భంగా విజయరమణా రావు మాట్లాడుతూ.. ఎలిగేడు మండలం లోని ముప్పిరితోట గ్రామంలో ప్రతి గడపకు వస్తుంటే ప్రజలు, సమస్యలు చెప్తుంటే స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలావుందో అర్ధమవుతుందనీ,
ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, జూనియర్ కళాశాల, 50 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని, చేయకపోతే నెల రోజులలో భారీ స్థాయిలో దీక్షకు కూర్చుంటా అని ఈ సందర్భంగా విజయ రమణా రావు పేర్కొన్నారు.అలాగే గ్రామంలో ఇప్పటి వరకు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అమలు కాలేదు అని అన్నారు. ఈ ప్రభుత్వం దళితులకు ఇస్తామన్న దళితబంధు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారనీ, ఉపాధి హామీకి సంబంధించి గ్రామంలో ఉపాధి పనిచేసిన కూలీలకు డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు అని మహిళలు చెప్తున్నారు.ఎన్నికల సమయంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు వాటి సంబంధించి ఎలాంటి రుణాలు లేవు , గత కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్న ఎస్సీ సబ్ ప్లాన్ ఎత్తివేయడం జరిగిందనీ, కేంద్ర రాష్ట్రప్రభుత్వాల నిర్వాకం వల్ల గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదనీ పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు ముప్పిరితోట గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో చెప్పాలని, నిరుద్యోగులకు ఉద్యోగులు లేవు, నిరుద్యోగ భృతి లేదనీ, రైతులు ధరణి పోర్టల్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారనీ, రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తాం అని చెప్పింది కానీ ఇప్పుడు త్రి పేస్ కరెంట్ విషయం లో ఎప్పుడు వస్తుందో అధికారుల దగ్గర కూడా సమాధానం లేదు అనీ పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్యే కి చెరువు మట్టి, ఇసుక మీద ఉన్న ద్యాస అభివృద్ధి చేయడంలో లేకపోయే నని,నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులను దోచుకుంటున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిధులు, నాయకులు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు , మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ NSUI కాంగ్రెస్ నాయకులు, గ్రామ యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.