జూలపల్లి ఫిబ్రవరి 25 కలం శ్రీ న్యూస్: మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్, తెలంగాణ వారు రక్షక – 2023 అవార్డుకు ఎంపి కయ్యారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా ఆగస్టు నుంచి డిసెంబరు వరకు స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వహణ, ఆపద లో ఉన్నవారికి సకాలంలో రక్తదానం చేసినం దుకు నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిట్స్ అండ్ యాక్టివిటిస్(నిఫా) అనే అంతర్జాతీయ సంస్థ మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ ను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 26న హర్యానాలోని కర్నాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ చేతుల మీదుగా మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంగిపెల్లి విద్యాసాగర్ అవార్డు అందుకోనున్నారు.