మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణ రెడ్డి కి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు
పెద్దపల్లి, అక్టోబర్ 03( కలం శ్రీ న్యూస్:
పెద్దపల్లి అసెంబ్లీ బిజెపి మాజీ శాసన సభ్యులు గుజ్జుల రామక్రిష్ణ రెడ్డి కి దసరా పండుగ సందర్భంగా తన నివాసంలో జమ్మీ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వాదం తీసుకున్న బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు, ఉపాధ్యక్షులు గజభీంకర్ పవన్, ఎనగందుల సతీష్. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బిజెపి కౌన్సిలర్ అభ్యర్థులను అధికసంఖ్యలో ఎలా గెలిపించుకోవాలో మాకు దిశ నిర్దేశం చేస్తు, ప్రతి వార్డుకు తనే స్వయంగా వచ్చి ప్రచారం చేసి అధిక సంఖ్యలో బిజెపి అభ్యర్థులను గెలిపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బిజెపి పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణ రెడ్డి కి వివరించడం జరిగింది.

