Thursday, October 10, 2024
Homeతెలంగాణవరంగల్రోగులను లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న మహిళ దొంగ అరెస్ట్

రోగులను లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న మహిళ దొంగ అరెస్ట్

రోగులను లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న మహిళ దొంగ అరెస్ట్

వరంగల్,జూన్7(కలం శ్రీ న్యూస్): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ఒంటరి మహిళా రోగులను లక్ష్యంగా చేసుకొని గొలుసు చోరీ లకు పాల్పడుతున్న మహిళా దొంగ ను మట్టేవాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.ఈ మహిళా కిలాడీ నుండి పోలీసులు రెండు లక్షల యాభై వేల రూపాయల విలువైన 35 గ్రాముల బంగారు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్ట్ కు సంభందించి వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వివరాలు వెల్లడిస్తూ కరీంనగర్ జిల్లా ముల్కనూర్ చెందిన తురసటి శారద (50) సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో, చికిత్స కోసం ఒంటరిగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ఒంటరి రోగులతో పరిచయం పెంచుకొని వారితో చనువు వుంటూ సదరు మహిళా రోగులను నిందితురాలు నిర్మానుష్యమైన ప్రదేశాలకు తీసుకెళ్ళి అక్కడ మహిళా రోగులను అదును చూసుకొని బెదిరింపులు పాల్పడంతో పాటు,వారిని కొట్టి వారి ఒంటిపై వున్న బంగారు ఆభరణాలు చోరీ పాల్పడేది. ఇదే తరహాలో నిందితురాలు గత నెల 28వ తేదిన చికిత్స కోసం యం.జి.యం కు వచ్చిన మహిళా రోగి వద్ద బంగారు గొలుసును చోరి చేసింది. ఈ సంఘటన పై భాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన మట్టేవాడ పోలీసులు కేసు నమోదు కొని ఇన్స్ స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకొని మట్టేవాడ నిందితురాలిని గుర్తించడం జరిగింది. నిందితురాలు మరో మారు చోరీ చేసేందుకు యం.జి.యంకు వచ్చినట్లుగా పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ఎస్.ఐ విఠల్ తన సిబ్బందితో వెళ్ళి నిందితురాలిని అదుపులోకి విచారించగా నిందితురాలు నేరాన్ని అంగీకరించడంతో పాటు గతంలో ఎల్కతుర్తి, హుజురాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లుగా అంగీకరించడంతో పాటు ఆమె ఇచ్చిన సమాచారంతో చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకొని మహిళా దొంగ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సంఘటనలో నిందితురాలిని పట్టుకోవడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన మట్టేవాడ ఇన్స్ స్పెక్టర్ గోపి, ఎస్. ఐ విఠల్, కానిస్టేబుళ్ళు ఆలీ, హరికాంత్, రాజేందర్, మహిళా కానిస్టేబుల్ రమ్యలను వరంగల్ ఏసీపీ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!