Wednesday, December 4, 2024
Homeతెలంగాణమద్యం మత్తులో లారీ డ్రైవర్, తప్పిన పెను ప్రమాదం.

మద్యం మత్తులో లారీ డ్రైవర్, తప్పిన పెను ప్రమాదం.

మద్యం మత్తులో లారీ డ్రైవర్, తప్పిన పెను ప్రమాదం.

ప్రాణ నష్టం,ఆస్తి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్న పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్.

పెద్దపల్లి,నవంబర్26(కలం శ్రీ న్యూస్):  రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వైపు ప్రయాణిస్తున్న లారీ డ్రైవర్ సాయంత్రం ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. మద్యం మత్తులో అతివేగంగా అజాగ్రత్తగా కర్ర ల లోడ్ తో ఉన్న లారీ ని డ్రైవరు జాతీయ రహదారిలో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ వాహనదారులను ఇబ్బందు లకు గురిచేస్తూ, రోడ్డుపై అడ్డదిడ్డంగా నడపడం చేస్తున్నాడనే సమాచారం అందుకున్న పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ వెంటనే స్పందించి, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ను అదుపులోకి తీసుకునీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా 360 పర్సెంటేజ్ రావడం జరిగిందని,లారీ ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించామని సీఐ అనిల్ కుమార్ తెలిపారు.మద్యం మత్తులో లారీ డ్రైవర్ వలన ఎవరికీ ప్రమాదం జరగకుండా వెంటనే స్పందించి, ఎంతో మంది వ్యక్తులకు ప్రాణ, ఆస్థి నష్టం కలగకుండా స్పందించిన ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, వారి సిబ్బంది కి వాహనదారులు, ప్రజలు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపి హార్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!