అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్ర పూజ
సుల్తానాబాద్,నవంబర్26(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని నీరుకుల్ల రోడ్ లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్ర పూజ కార్యక్రమంలో భాగంగా అర్చకులు సుంపటం కార్తీక్, రవీందర్, దత్తాత్రేయ, కార్తీక్ ఆచార్యుల సారధ్యంలో ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమము అనంతరం అయ్యప్ప స్వామి నామస్మరణ, సంకీర్తనలతో శరణు ఘోష చేస్తూ స్వామివారికి పంచామృత సహిత ఫలాభిషేకం, అలంకారం, పుష్పార్చన, ధూపం దీపం,మహా నైవేద్యం, మహా హారతి, మంత్రపుష్పం, ఆశీర్వచనము అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు, అయ్యప్ప మాలధారులకు దేవాలయ కమిటీ సభ్యులు నల్లవెల్లి సతీష్ అన్న ప్రసాద వితరణ చేశారు.సాయంత్రం ప్రదోష కాలంలో మహా పడి పూజ కార్యక్రమం,భజన,స్వామి సంకీర్తలతో ఆలయం మొత్తం మారుమోగింది.ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ.. భవ్యమైన మందిరంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్ర పూజ యొక్క విశిష్టతను తెలుపుతూ దేవాలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కరుణాకటాక్ష కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో విలసిల్లాలని ప్రార్థించారు. అలాగే భక్తులు, దాతలు ముందుకు వచ్చి దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ శాశ్వత గౌరవాధ్యక్షులు శనిగరపు శంకరయ్య మిట్టపల్లి మురళీధర్ గురుస్వామి, మాటేటి శ్రీనివాస్ గురు స్వామితోపాటు అయ్యప్ప మాలాధారులు, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.