సుల్తానాబాద్ కోర్టులో ఇ-సేవా కేంద్రం ప్రారంభం
సుల్తానాబాద్,నవంబర్24(కలం శ్రీ న్యూస్):
కక్షిదారులకు డిజిటల్ రూపంలో సేవలు అందించేందుకు ఇ-సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. సుల్తానాబాద్ కోర్టులో ఏర్పాటుచేసిన ఇ-సేవా కేంద్రాన్ని ఆదివారం జడ్జి గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే తెలంగాణలో నేడు వర్చువల్ విధానం ద్వారా 65 కోర్టులో ఇ- సేవా కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. కేసు స్థితిగతులు, తదుపరి విచారణ తేదీ, సంబంధిత విచారణలు స్వీకరించడం, సర్టిఫైడ్ కాపీల కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం, ట్రాఫిక్ చలాన్లు జరిమానాలు ఆన్ లైన్ లో చెల్లించడం, ఇ-ములఖాత్ అపాయింట్మెంట్ ద్వారా జైల్లో ఉన్న బంధువులను కలవడానికి సహాయ పడడం లాంటి పలు సేవలను ఇ- సేవా కేంద్రం ద్వారా కక్షిదారులకు డిజిటల్ రూపంలో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏజీపి దూడం ఆంజనేయులు, ఎస్ఐ శ్రవణ్ కుమార్, న్యాయవాదులు మాడూరి ఆంజనేయులు, అకారపు సరోత్తం రెడ్డి, వోడ్నాల రవీందర్, బోయిని భూమయ్య, పెగడ శ్యాంసుందర్, సామల రాజేంద్రప్రసాద్, మల్యాల కరుణాకర్, రుద్రారపు నర్సయ్య, వడ్లకొండ రవికిరణ్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.