ధూళికట్ట గ్రామంలో ఏక్ పెడ్ మా కె నామ్ కార్యక్రమం
ఏలిగేడు,నవంబర్24(కలం శ్రీ న్యూస్):
ఏలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో స్వామి వివేకానంద వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో “ఏక్ పెడ్ మా కె నామ్” కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ సందనవేణి ఓమేష్ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో మనిషి జీవనానికి ఎంతో తోడ్పడుతుందనీ, ప్రతి ఒక్క యువత బాధ్యతగా చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ సందనవేణి ఓమేష్, వెంకటేష్, సాయిరాం, ఆదిత్య, సాగర్, రాహుల్, తరుణ్, రిషి తదితరులు పాల్గొన్నారు.