Wednesday, December 4, 2024
Homeతెలంగాణమున్సిప‌ల్ ఉద్యోగులు, సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం.

మున్సిప‌ల్ ఉద్యోగులు, సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం.

మున్సిప‌ల్ ఉద్యోగులు, సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం.

సుల్తానాబాద్,నవంబర్15(కలం శ్రీ న్యూస్):

కరీంనగర్‌ మెడికవర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం సుల్తానాబాద్ మున్సిప‌ల్ కార్యాల‌యంలో మున్సిప‌ల్‌ ఉద్యోగులు, సిబ్బందికి ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిభిరాన్ని మున్సిప‌ల్ చైర్మన్ గాజుల లక్ష్మి రాజమల్లు, క‌మిష‌న‌ర్ ఆకుల వెంక‌టేశ్‌ ప్రారంభించారు. శిభిరంలో 120 మందికి బీపీ, షుగర్, ఈసీజీ, 2డి ఎకో మొదలగు సూపర్‌ స్పెషాలిటీ వైద్య పరీక్షలు చేశారు. ఆసుపత్రి డాక్టర్‌ దీక్షిత్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికవర్‌ సెంటర్‌ హెడ్‌ గుర్రం కిరణ్‌ మాట్లాడుతూ మున్సిప‌ల్ ఉద్యోగులు, సిబ్బంది, స్థానిక ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతోనే ఈ వైద్య శిబిరం నిర్వహించామని అన్నారు. అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా, సెలవులతో సంబంధం లేకుండా రాత్రి, పగలనే తేడా లేకుండా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌ మేనేజర్‌ కోట కరుణాకర్ బొంగోని హారీష్, శ్రీ‌నివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!