Wednesday, December 4, 2024
Homeతెలంగాణబాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి కుటుంబానికి న్యాయం చేయాలి.

బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి కుటుంబానికి న్యాయం చేయాలి.

బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి కుటుంబానికి న్యాయం చేయాలి.

సుల్తానాబాద్,నవంబర్12(కలం శ్రీ న్యూస్):

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సుల్తానాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎబీవీపీ నాయకులు బండి రాజశేఖర్, ప్రవీణ్ మాట్లాడుతూ నిర్మల్  బాసర ట్రిపుల్ ఐటీ లో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని, పరామర్శకు వెళితే విద్యార్థినికి న్యాయం చేయకుండా, న్యాయం కోసం వెళ్లిన ఏబీవీపీ నాయకులను అక్కడున్న యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ సిబ్బందిని, సెక్యూరిటీలను పెట్టి కనీసం విద్యార్థులని చూడకుండా ఇష్టం వచ్చినట్లు, విచక్షణ రహితంగా దాడి చేయడం ఎంతో బాధాకరం అని, ఇలాగే గతంలో కూడా ఒక విద్యార్థిని చనిపోతే ఇలానే ఏబీవీపీ విద్యార్థి నాయకులపై దాడి చేయించారు. ఇలా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రాణాలు వారానికి ఒకటి పోయినా కనీసం పట్టించుకోకుండా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రభుత్వం. బాసర ట్రిపుల్ ఐటీ లో జరుగుతున్న ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యతవహించి, విద్యార్థిని కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని ఎబివిపి డిమాండ్ చేస్తుంది. అలాగే ఎబివిపి విద్యార్థి నాయకులపై దాడి చేసిన సెక్యూరిటీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి, లేదంటే బాసర ట్రిపుల్ఐటీ విద్యార్ధులకు న్యాయం జరిగేంతవరకు ఎబివిపి పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు వినయ్, నాయకులు మేరుగు సిద్ధార్థ, గణేష్, ఆశిష్, సంజయ్, వంశీ సాయి, కార్తీక్,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!