Wednesday, December 4, 2024
Homeతెలంగాణబెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ సేవలు అభినందనీయం.

బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ సేవలు అభినందనీయం.

బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ సేవలు అభినందనీయం.

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ 

సుల్తానాబాద్,నవంబర్11(కలం శ్రీ న్యూస్):

బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ సమస్త సభ్యుల సేవలు అభినందనీయమని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. సోమవారం సుల్తానాబాద్ పట్టణంలోని హైస్కూల్లో విద్యార్థులకు 1,50,000 విలువగల స్కూల్ బ్యాగ్స్, భోజన ప్లేట్లు, లైబ్రరీ పుస్తకాలు, రెండు డెస్క్ టాప్ కంప్యూటర్లు, ఒక జిరాక్స్ ప్రింటర్, సైన్స్ విద్య కోసం ఒక సూక్ష్మ దర్శిని తో పాటు విద్యార్థులకు రెండు అల్మారాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోలేటి దామోదర్ మాట్లాడుతూ బెస్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ కోలేటి సతీష్ ఇంత మంచి సామాజిక సేవ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషమన్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు అందజేసిన సతీష్ తో పాటు బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ వారి కి పొలిటి దామోదర్ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోలేటి సతీష్ కుమార్, మాజీ జెడ్పిటిసి సభ్యులు డాక్టర్ అయిల రమేష్, పెద్దపెల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి అల్లంకి లింగమూర్తి, సుల్తానాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, వాసవి క్లబ్ రీజియన్ సెక్రెటరీ బాదం వాణి, వాసవి వనిత క్వీన్స్ క్లబ్ అధ్యక్షురాలు జైశెట్టి సుమ, ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ సభ్యులు, బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ సభ్యులు పెగడ చందు, శెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథి కోలేటి దామోదర్ తో పాటు అతిధులను కోలేటి సతీష్ కుమార్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!