Wednesday, December 4, 2024
Homeతెలంగాణరాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు

సుల్తానాబాద్,నవంబర్ 10 ( కలం శ్రీ న్యూస్) : ఈ నెల 5న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎస్ జి ఎఫ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన 17 సంవత్సరాల బాలబాలికల రగ్బీ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు శివ ప్రసాద్, శ్రీకర్, బ్లేస్సి, అన్విత లు ఈ నెల 10,11,12 వ తేదీలలో మేడ్చల్ లో జరిగే రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సత్యం తెలియజేశారు.చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించి రాష్ట్రస్థాయి నుండి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, ఇక్బాల్, శివ, సతీష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!