Monday, February 10, 2025
Homeతెలంగాణఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడుగా పూసాల రామకృష్ణ ఎన్నిక 

ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడుగా పూసాల రామకృష్ణ ఎన్నిక 

ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడుగా పూసాల రామకృష్ణ ఎన్నిక 

సుల్తానాబాద్,సెప్టెంబర్22(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మండల అధ్యక్షులుగా పూసాల రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక సాయిరాం గార్డెన్ లో ఏర్పాటు చేసిన సుల్తానాబాద్ మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా పూసాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ శశి వర్ధన్ , కోశాధికారిగా మేరుగు హరీష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ మాట్లాడుతూ సంఘ ఏకగ్రీవ ఎన్నికలే ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ఐక్యతతో సంఘ అభివృద్ధి కోసం సభ్యుల సంక్షేమ కోసం కృషిచేయాలన్నారు.మండలంలోని ప్రతి ఫోటో, వీడియోగ్రాఫర్ కుటుంబ భరోసాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి ఇర్ఫాన్, కుర్మ రమేష్ బాబు, గంధం రాజేష్ లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఫోటో ఫామ్ అధినేత శశాంక,బీట్ల రమేష్,యెల్ల రాజు,బోయిని వినోద్,రాపోలు తిరుపతి, సంపత్, చింటూ,శివ, హరీష్ లతో పాటు అధిక సంఖ్యలో ఫోటో వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!