Tuesday, October 8, 2024
Homeతెలంగాణఎంపి ఆర్. కృష్ణన్న జన్మదినం సందర్భంగా నిరుపేద కుటుంబానికి నెలకి సరిపడా బియ్యం, నిత్యవసర సరుకుల...

ఎంపి ఆర్. కృష్ణన్న జన్మదినం సందర్భంగా నిరుపేద కుటుంబానికి నెలకి సరిపడా బియ్యం, నిత్యవసర సరుకుల పంపిణీ

ఎంపి ఆర్. కృష్ణన్న జన్మదినం సందర్భంగా నిరుపేద కుటుంబానికి నెలకి సరిపడా బియ్యం, నిత్యవసర సరుకుల పంపిణీ

సుల్తానాబాద్,సెప్టెంబర్13(కలం శ్రీ న్యూస్):

రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణన్న జన్మదినం సందర్భంగా పేద వారికి సహాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామ నివాసి నిరుపేద కుటుంబానికి  చెందిన పబ్బ శ్రీనివాస్, పబ్బ వెంకటేష్ ల కుటుంబాలకి ఒక నెలకి సరిపడా 25కిలోల బియ్యం, నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ గౌడ్ మాట్లాడుతూ కృష్ణన్న  బీసీల ఉన్నతి కోసం చేసిన సేవలను కొనియాడుతూ,రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో బీసీ కుటుంబాలకు తోడుగా నీడగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రం శివ గౌడ్, ఇళ్ళందుల శ్రీనివాస్, వడ్లకొండ శశి వర్ధన్, బొగ శ్రీకాంత్, భోగ సాయి, మద్దెల సతీష్, ఇల్లందుల అశోక్, తాండ్ర కిరణ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!