ఘనంగా కుంకుమార్చన పూజలు
సుల్తానాబాద్,సెప్టెంబర్13(కలం శ్రీ న్యూస్):
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సుల్తానాబాద్ మండలంలోని కందునూరుపల్లి అనుబంధ గ్రామమైన హనుమాండ్లపల్లి లో కుంకుమార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు కుంకుమ పూజా పూజలు తలపెట్టగా గ్రామానికి చెందిన మహిళలచే వేద పండితులు వినాయక మండపంలో కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వినాయక స్వామి వారికి గ్రామంలోని ప్రతి ఇంటి నుండి నైవేద్యాలు తీసుకొచ్చి సమర్పించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చొప్పరి మల్లయ్య, అంజయ్య, రవీందర్, రవి, రాజు, వినోద్. నరేష్ రమేష్ లతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజని విజయవంతంగా నిర్వహించారు.