Tuesday, October 8, 2024
Homeతెలంగాణరాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థులు

రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థులు

రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థులు

అభినందించిన ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి

సుల్తానాబాద్, సెప్టెంబర్13(కలం శ్రీ న్యూస్):

రాష్ట్రస్థాయి జూనియర్స్ బేస్ బాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు సుల్తానాబాద్ అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను శుక్రవారం పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు క్రీడారంగంలో నిష్ణాతులైన శిక్షకులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించడంతో విద్యార్థులు రాష్ట్ర జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతమైన సుల్తానాబాద్ నుంచి క్రీడాకారులు వెలుగులోకి రావడం సంతోషకరమన్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎంపిక పోటీల్లో సుల్తానాబాద్ ఆల్ఫోర్స్ పాఠశాలకు చెందిన పి.అభిషేక్ సన్వీత్ కుమార్, కె.సుయాస్, రిత్విక్, ఎస్.ప్రణయ్ కుమార్ ఎంపికయ్యారని తెలిపారు. నేటి నుంచి ఈ నెల 16 వరకు నిర్మల్ పట్టణంలో జరగనున్న జూనియర్స్ బేస్ బాల్ పోటీల్లో ఈ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అద్వితీయమైన ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపీ కావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!