Tuesday, October 8, 2024
Homeతెలంగాణఆర్యవైశ్యుల ఐక్యతతో నే అభివృద్ధి 

ఆర్యవైశ్యుల ఐక్యతతో నే అభివృద్ధి 

ఆర్యవైశ్యుల ఐక్యతతో నే అభివృద్ధి 

నగునూరి అశోక్ కుమార్…

సుల్తానాబాద్,సెప్టెంబర్13(కలం శ్రీ న్యూస్):

ఆర్యవైశ్యులందరూ ఐక్యతతో ఉంటేనే అభివృద్ధి సాధించుకోవచ్చని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సభ్యులు నగునూరి అశోక్ కుమార్ అన్నారు.శుక్రవారం సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్ లో నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గాల ను ఆయన ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఐక్యతతో ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని అన్నారు.అంతకుముందు పూజారి పారువెల్ల రామ్మూర్తి శర్మ , అభిషేక్ శర్మ లచే ఆశీర్వచన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడిన పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమురవెల్లి రామ్మూర్తి , అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, సెక్రటరీ తొడుపునూరి రాజేంద్రప్రసాద్, క్యాషియర్ కొమురవెల్లి (కేబి) శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలిగా బాదం వాణి, ప్రధాన కార్యదర్శిగా కొమురవెల్లి చంద్రకళ, క్యాషియర్ గా రామిడి లత, పట్టణ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు గా నాగమల్ల ప్రశాంత్, అధ్యక్షుడిగా మాడురి సందీప్, సెక్రెటరీ చకిలం సురేష్ కుమార్, కోశాధికారిగా చిట్టిమల్ల వినయ్ కుమార్ తోపాటు కార్యవర్గాలను ఎన్నుకోవడం జరిగింది.నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గాలను ఆర్యవైశ్యులు అందరూ కలిసి అభినందనలు తెలపడంతో పాటు ఘనంగా సన్మానించారు. అలాగే పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నలమాచు ప్రభాకర్, కోలేటి రమేష్ ల ను ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి , పెద్దపల్లి జిల్లా కార్యదర్శి అల్లంకి లింగమూర్తి, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సభ్యులు మాడురి ప్రసాద్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనా రాయణ, పల్లకిషన్, గుండా నారాయణ, ముస్త్యాల కిషన్ తోపాటు పలువురు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!