Tuesday, October 8, 2024
Homeతెలంగాణకమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి కి సిఐటియు ఘన నివాళి

కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి కి సిఐటియు ఘన నివాళి

కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి కి సిఐటియు ఘన నివాళి

సుల్తానాబాద్,సెప్టెంబర్13(కలం శ్రీ న్యూస్):

కమ్యూనిస్టు దిగ్గజం కార్మిక వర్గ నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి  నిన్న అనారోగ్యంతో మరణించగా,శుక్రవారం వారి చిత్రపటానికి సిఐటియు సుల్తానాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో గొల్లపల్లి గోడౌన్స్ వద్ద ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుండే ప్రజా పోరాటాల్లో రాటుదేలారని, అనంతరం కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి, అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీలతో సంబంధాలు నెలకొల్పిన నాయకులు, సిపిఎం పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారని, భారత దేశంలో దోపిడి రహిత సమ సమాజం కోసం నిరంతరం శ్రమించారని అన్నారు. లౌకిక తత్వాన్ని, రాజ్యాంగాన్ని, ఫెడరలిజన్ని కాపాడడానికి జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారని, చివరి శ్వాస వరకు శ్రామిక ప్రజల విముక్తి కోసం పోరాడారని అన్నారు. వారి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి, శ్రామిక ప్రజలకు, కార్మిక వర్గ పోరాటాలకు తీరని లోటని అన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి కి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు సుల్తానాబాద్ మండల కమిటీ కన్వీనర్ తాండ్ర అంజయ్య, వివిధ సంఘాల నాయకులు గుమస్తాల సంఘం అధ్యక్షులు,మాతంగి రాజమల్లు, లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు, పోగుల తిరుపతి, రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, తిరుపతి రెడ్డి, సాదిక్, రఫీక్. కిరణ్. వీరస్వామి. వాజిద్ బేగ్. రాజేశం. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!