Tuesday, October 8, 2024
Homeతెలంగాణరాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థి

రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థి

రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థి

అభినందించిన అధినేత నరేందర్ రెడ్డి

సుల్తానాబాద్, సెప్టెంబర్12(కలం శ్రీ న్యూస్):  తెలంగాణ రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే 34వ సబ్ జూనియర్ కోకో పోటీల్లో పాల్గొనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు సుల్తానా పట్టణానికి చెందిన ఆల్ఫోర్స్ విద్యార్థి నాంపల్లి సిద్ధార్థ ఎంపికయ్యాడని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి ఎంపికైన విద్యార్థి సిద్ధార్థ ను ప్రత్యేకంగా అభినందిస్తూ నేటి నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ లోని మౌలాలి లో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో కరీంనగర్ లో జరిగిన ఎంపిక పోటీల్లో సిద్ధార్థ అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు . రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!