Tuesday, October 8, 2024
Homeతెలంగాణగణేష్ మండపం వద్ద  సామూహిక కుంకుమ పూజలు, మహా అన్న ప్రసాద వితరణ 

గణేష్ మండపం వద్ద  సామూహిక కుంకుమ పూజలు, మహా అన్న ప్రసాద వితరణ 

గణేష్ మండపం వద్ద  సామూహిక కుంకుమ పూజలు, మహా అన్న ప్రసాద వితరణ

ఓదెల,సెప్టెంబర్12(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని భాయమ్మ పల్లె హనుమాన్ ఆలయం వద్ద గల గణేష్ మండపం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి అనంతరం మహా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ తొమ్మిది రోజులు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అందులో భాగంగా ఈరోజు మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రము లోని ప్రజలు అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు అధిక పంటలు పండాలని కోరుకున్నమన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, యాదవ సంఘం మండలాధ్యక్షుడు కావేటి రాజు యాదవ్, మాజీ సర్పంచ్ లు పడాల రాజు, తెలుసురి కొమురయ్య, అలెటి సంపత్ రెడ్డి,కమిటీ సభ్యులు దయ్యాల మల్లేష్, పడాల నరేష్, డోబిల మల్లయ్య, దయ్యాల వీరేశం, మద్దూరి లింగయ్య,గిరాం సదానందం, మారం నర్సింహా రెడ్డి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!