Tuesday, October 8, 2024
Homeతెలంగాణగణేష్ నిమజ్జనంకు అన్ని ఏర్పాట్లు పూర్తి.

గణేష్ నిమజ్జనంకు అన్ని ఏర్పాట్లు పూర్తి.

గణేష్ నిమజ్జనం కు అన్ని ఏర్పాట్లు పూర్తి.

మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు. 

సుల్తానాబాద్,సెప్టెంబర్12(కలం శ్రీ న్యూస్): గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణం లో సోమవారం జరగబోయే గణేష్ నిమజ్జనంకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రహదారులను శుభ్ర పరచడంతో పాటు రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేస్తున్నామని తెలిపారు. క్రేన్ సహాయం ద్వారా గణేష్ లను స్థానిక పెద్ద చెరువులో నిమజ్జనం చేసేందుకు, ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు, లైటింగ్ సిస్టమ్, గజ ఈతగాళ్ళను, అందుబాటులో ఉంచామని మంచి నిటి సదుపాయం, టెంట్లు కుర్చీలు వేసేందుకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారన్నారు.ఈ సమావేశం లో వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, కౌన్సిలర్లు పసెడ్ల మమత సంపత్, నిషాద్ రఫీక్, పారుపల్లి జ్ఞానేశ్వరి గుణపతి, కూకట్ల గోపి, గొట్టం లక్ష్మి మల్లయ్య, అనుమల అరుణ బాబురావు, రెవెల్లి తిరుపతి, దున్నపోతుల రాజయ్య, గుర్రాల శ్రీనివాస్, మేనేజర్ అలిమొద్దిన్ , సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!