Tuesday, October 8, 2024
Homeతెలంగాణమ్యూజియంను సందర్శించిన ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు 

మ్యూజియంను సందర్శించిన ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు 

మ్యూజియంను సందర్శించిన ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు 

సుల్తానాబాద్, సెప్టెంబర్-11 (కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు సాంఘిక శాస్త్రం ప్రాజెక్ట్‌ లో భాగంగా 7వ తరగతి విద్యార్థులు పెద్దపల్లిలోని కలెక్టరేట్‌, మ్యూజియంలను సందర్శించి నవీన శిలాయుగం, ప్రాచీన శిలాయుగపు రాతి పనిముట్లు, శిలాజాలు, పురాతన నాణేలను పరిశీలించారు. ఇండియన్ పబ్లిక్ పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పురాతన కాలంలో ఆదిమానవులు ఉపయోగించిన రాతి పనిముట్లను, శిలాజాలను, పురాతన నాణేలను విద్యార్థులకు చూపిస్తూ, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ, మ్యూజియంలు ఉండడం వల్లే పురాతన కాలంలో మన పూర్వీకులు వాడిన రాతి పనిముట్లు, పరికరాలు, నాణేలు ప్రస్తుతం మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయని, మ్యూజియంలే లేకపోతే మన పూర్వీకుల చరిత్రలు కనుమరుగైపోయేవని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!