Tuesday, October 8, 2024
Homeతెలంగాణప్రభుత్వ పాఠశాలకు సిలిండర్లు గ్యాస్ స్టవ్ ల వితరణ. 

ప్రభుత్వ పాఠశాలకు సిలిండర్లు గ్యాస్ స్టవ్ ల వితరణ. 

ప్రభుత్వ పాఠశాలకు సిలిండర్లు గ్యాస్ స్టవ్ ల వితరణ. 

ఎలిగేడు,సెప్టెంబర్11(కలం శ్రీ న్యూస్):

ఎలిగేడు మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్, ప్రైమరీ స్కూల్ పాఠశాలకు కేశెట్టి వైకుంఠం-వజ్రమ్మ ల జ్ఞాపకార్థం వారి మనవడు రాఘవేంద్ర ఫర్టిలైజర్స్, భారత్ గ్యాస్ భాగస్వామ్యులు కేశెట్టి రాఘవేంద్ర-అపర్ణ దంపతులు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయు లకు సిలిండర్లు, గ్యాస్ స్టవ్ లు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ నేను ఇదే పాఠశాలలో చదివి ఈ పాఠశాలలకు ఈ విధంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొరకు గ్యాస్ సిలిండర్లు,గ్యాస్ పొయ్యిలు వితరణ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు దేవేందర్ రావు, ప్రైమరీ ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వర్, ఎలిగేడు మండలం ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీష్ బాబు, పూర్వ వార్డు సభ్యులు కవ్వంపల్లి నారాయణ, భారత్ గ్యాస్ సిబ్బంది సదానందం, అంజిబాబు, నరేష్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!