Tuesday, October 8, 2024
Homeతెలంగాణవిదేశాల్లో రాహుల్ విద్వేశ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు   

విదేశాల్లో రాహుల్ విద్వేశ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు   

విదేశాల్లో రాహుల్ విద్వేశ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు   

బహిరంగ లేఖలో బిజెపి నేత సురేష్ రెడ్డి  

పెద్దపల్లి,సెప్టెంబర్11(కలం శ్రీ న్యూస్):

ప్రపంచ మీడియాలో ప్రచారం కొరకు ఏకంగా దేశ భద్రతను ఉగ్రవాదులకు తాకట్టుపెట్టడం నీతిమాలిన చర్య అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం సురేష్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దేశ ప్రధాని నరేంద్రమోదీ కి, భారత దేశానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడం రాహుల్ గాంధీ నీతిమాలిన చర్యలకు నిదర్శనమని ద్వజమెత్తారు. రాహుల్ గాంధీ తీరుపట్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు తీవ్రంగా స్పందిస్తున్నట్లు తెలిపారు.  టెక్సాస్‌లో చేసిన ప్రసంగాలలో, భారత ఆర్థిక వ్యవస్థను తక్కువ చేసి, అవహేళన చేయడం రాహుల్ గాంధీ మానసిక స్థితి ని ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. బలమైన భారతదేశ వ్యతిరేక భావాలు కలిగిన వార్తాపత్రికలు కూడా భారత ఆర్థిక వ్యవస్థను, దేశంలోని తయారీ, మౌలిక సదుపాయాల రంగాలు సాధించిన అపూర్వమైన పురోగతిని ప్రశంసిస్తున్నాయని సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. విదేశాల్లో దేశానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడటం పరిపాటి అయ్యిందని ఘాటుగా విమర్శించారు.విదేశాల్లో భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉపయోగించిన భాషపై ఆశ్చర్యపోయినట్లు ఫ్లోరిడాకు చెందిన టెక్నోక్రాట్ రామ్ రాజేంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సురేష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రతిష్టను పెంచాల్సిన బాద్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సురేష్ రెడ్డి హితవు పలికారు. లేనిపక్షంలో దేశప్రజలు వెలివేసి దేశం నుండి తరిమికొడుతారని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!