లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ.
సుల్తానాబాద్,సెప్టెంబర్10(కలం శ్రీ న్యూస్):
జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన పక్సోత్సవాల సందర్భంగా నేత్రదానంపై అవగాహన కల్పించడం కొరకు పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్ ను విడుదల చేసిన అనంతరం మండలంలోని సుమారు వంద ఆటోలకు అవగాహన స్టిక్కర్లను అంటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక పోలీసు స్టేషన్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు శ్రవణ్ కుమార్, వేణుగోపాల్ హాజరైనారు.ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, ఒక్కరి నేత్రదానం వలన ఇద్దరు అందులకు చూపును అందించవచ్చని, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అనారోగ్యంతో సుమారు కోటి మంది మరణిస్తున్నారని, అందులో రెండు శాతం మంది నేత్రదానం చేసిన అందత్వ నివారణ చేయవచ్చని, కనుక మనిషి నేత్రాలు మట్టిలో కలవకుండా, మంటలో ఖాళీ బూడిద అవ్వకుండా నేత్రదానం చేస్తే మరణానంతరం కూడా అతని నేత్రాలు మరో ఇద్దరు వ్యక్తులు ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతారని, అందువలన అందత్వ నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ మరణానంతరం “నేత్రదానం చేయండి – మరో ఇద్దరికి కంటి చూపును అందించండి” అనే నినాదంతో నేత్రదానం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్ సభ్యులు పూసాల సాంబమూర్తి, చకిలం వెంకటేశ్వర్లు, నాగమల్ల ప్రశాంత్ కుమార్, ఏనుగు నరేందర్ రెడ్డి, దేవల్ల నరేందర్, ఎర్రబెల్లి సుధీర్ రావు పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.