గాంధీనగర్ గణపతి మండపం వద్ద అన్నదానం
సుల్తానాబాద్,సెప్టెంబర్9(కలం శ్రీ న్యూస్):
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం పట్టణంలోని గాంధీనగర్ గణపతి మండపం వద్ద పట్టణానికి చెందిన వార్త దినపత్రిక సీనియర్ జర్నలిస్ట్, పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మేర్గు జ్యోతి యాదగిరి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్ లు గణపతిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం గాంధీనగర్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేర్గు యాదగిరి దంపతులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనుమాల అరుణ బాబురావు, మేడి శ్రీనివాస్, కామనీ వెంకన్న, మేడి శ్రీధర్ , సామల రాజేంద్రప్రసాద్, చిలగాని సందీప్, అనుమాల సూరజ్ , కామని శ్రీకాంత్, దేవరకొండ మణిదీప్, గుంటి సాయి, బొమ్మ సాయి, తుమ్మ నిశాంత్, ఆషాడపు క్రాంతి, సముద్రాల విష్ణు, సురేష్, తదితరులు పాల్గొన్నారు