ప్రభుత్వ దవాఖాన ను ఆకస్మిక తనిఖీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే
సుల్తానాబాద్,సెప్టెంబర్3(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ల నమోదు ప్రక్రియను, పలు వార్డులను ఆయన పరిశీలించారు. ఓపీ వైద్య పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించారు. అలాగే వార్డుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లను వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి పేషంట్ ను పలకరించి వారి ఆరోగ్య స్థితిగతులను , బాగోగులను అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేసి హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ రమాదేవి నుండి వివరాలు అడిగారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అనేక గ్రామాలకు మండలాలకు కూడలి అయిన సుల్తానాబాద్ హాస్పిటల్ లో వైద్యం అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హాస్పిటల్ లో ఉన్న మాదిరిగా పరిశుభ్రత పరిసరాల్లోనూ ఉంచాలని డాక్టర్లకు సూచించారు. రాబోయే రోజుల్లో హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హాస్పిటల్ లో జనరేటర్, ఈసీజీ ఇతరత్రా వైద్య సదుపాయాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మినుపాల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, ముస్త్యాల రవీందర్, దన్ నాయక్ దామోదర్ రావు,కల్లేపల్లి జానీ,వేగోళం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, వార్డు కౌన్సిలర్లు దున్నపోతుల రాజయ్య, నిషాద్ రఫీక్, కుమార్ కిషోర్, మేడి శ్రీనివాస్, గాదాసు రవీందర్, అమీరీ శెట్టి రాజలింగం, పన్నాల రాములు, అమీరి శెట్టి తిరుపతి, ఫారుక్, అమీనోద్దీన్ లతో పాటు డాక్టర్ల బృందం రమాదేవి, వైద్య సిబ్బంది తో పాటు పలువురు పాల్గొన్నారు