విజ్జన్న ని మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్
సుల్తానాబాద్,ఆగస్టు25(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గా ఎన్నికైనందున తాళ్లపల్లి మనోజ్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు నీ మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గ బీసీల సమస్యల పరిష్కారం కొరకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోజ్ గౌడ్ నీ సత్కరించి మాట్లాడుతూ పేదల, వెనుకబడిన వర్గాల పక్షాన పనిచేయాలని మా మద్దతు తప్పకుండా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకాష్ రావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల సంతోష్ రావు, జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మల్యాల సంజీవ్ గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కల్వల శ్రీనివాస్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటి సతీష్ రావు, యూత్ కాంగ్రెస్ నాయకుడు ఒర్రె అజయ్ యాదవ్ పాల్గొన్నారు.