Thursday, September 19, 2024
Homeతెలంగాణఐపీఎస్ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

ఐపీఎస్ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

ఐపీఎస్ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

సుల్తానాబాద్, ఆగస్టు 24 (కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో పండుగల సంస్కృతిని ప్రతిబింబిస్తూ, కృష్ణాష్టమి ముందస్తు వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు.చిన్న పిల్లలందరూ బాల కృష్ణుడు, గోపికల వేష ధారణతో తమ ముద్దు ముద్దు మాటలతో చూపరులను ఆకర్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆటపాటలతో అలరించారు. శ్రీకృష్ణుని దశావతారాల ప్రదర్శన కన్నులకు కట్టినట్లు చూపించారు. రాధాకృష్ణులుగా చిన్నారులు సందడి చేశారు. భగవద్గీతా పఠనం చేయించారు. పండుగ సంప్రదాయంలో భాగంగా కోలాటం ఆడి ఉత్సాహ భరితంగా ఉట్టికొట్టే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగ విశిష్టతల గురించి తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని పునరుద్ధరించటానికి నన్ను నేను సృష్టించుకుంటానని శ్రీకృష్ణుడు అర్జునిడికి తెలిపాడని అన్నారు. భారత యుద్ధంలో పాండవుల పక్షాన ఉండి ధర్మాన్ని గెలిపించి అధర్మంగా వ్యవహరించిన కౌరవుల ఓటమికి కీలకపాత్ర వహించాడని తెలిపారు. భూలోకంలో ధర్మం గతి తప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. శ్రీకృష్ణాష్టమి పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!