Thursday, September 19, 2024
Homeతెలంగాణజాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు.

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు.

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు.

సుల్తానాబాద్,ఆగస్ట్ 24 (కలం  ): జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుక్రవారం సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలోని విద్యార్థులకు క్విజ్ పోటీలు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్ మాటేటి శ్రీనివాస్, క్లబ్ సభ్యులు మాట్లాడుతూ చంద్రయాన్‌-3 విజయానికి గుర్తుగా ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. ఇస్రో చంద్రయాన్‌-3 అంతరిక్ష యాత్ర చేపట్టి ఆగస్టు 23వ తేదీ ల్యాండర్‌ను చంద్రుడిపై దింపిందన్నారు. విద్యార్ధులు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాలవైపు మొగ్గు చూపేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, అంతరిక్ష పరిశోధన అభివృద్ధి మానవాళికి కలిగే ఉపయోగాలు తదితర విషయాలను విద్యార్థులకు వివరించడంతోపాటు చంద్రయాన్-3 ప్రయోగ విజయంతో విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వించేలా కృషిచేసిన అంతరిక్ష శాస్త్రజ్ఞులకు వినమ్రంగా నమస్కరిస్తూ అభినందనలు తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు అంతరిక్షంపై చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్లు వలస నీలయ్య, జూలూరి అశోక్, కార్యదర్శి పిట్టల వెంకటేశం, రాయల్ల నవీన్, ఏనుగు నరేందర్ రెడ్డి, నోముల వేణుగోపాల్, ఉపాధ్యాయులు, పాఠశాల డైరెక్టర్ కృష్ణప్రియ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!