Thursday, September 19, 2024
Homeతెలంగాణప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

జడ్జి దుర్గం గణేష్

సుల్తానాబాద్,ఆగస్టు24(కలం శ్రీ న్యూస్):

ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. శనివారం స్థానిక కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయంలో కరీంనగర్ ఫార్చూన్ మెడ్ కేర్ హాస్పిటల్ చే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ను జడ్జి గణేష్ ప్రారంభించారు. స్థానిక పార్చూన్ మెడ్ కేర్ వైద్యులు అబ్దుల్ రహమాన్, సింధూరాజ్, సతీష్ రెడ్డి లు న్యాయవాదులకు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు సుమారు 150 మందికి బి.పి, షుగర్,ఈసీజీ, 2డి ఏకో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆహారం విషయంలో అలవాట్లు శ్రద్ధ వహించాలని, వయసు మీరిన వారికి మితాహారం శ్రేయస్కరం అని అన్నారు. వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏజిపి ఆవుల లక్ష్మిరాజం, హెల్త్ క్యాంప్ ఇంచార్జ్ గజవెల్లి గణేష్, న్యాయవాదులు, భూసారపూ బాలకిషన్ ప్రసాద్, మాడూరి ఆంజనేయులు, వోడ్నాల రవీందర్, ఆకారపు సరోత్తం రెడ్డి, అవునూరి సత్యనారాయణ, బోయినీ భూమయ్య, నేరెళ్ళ శంకరయ్య, సామల రాజేంద్రప్రసాద్ లతో పాటు మెడ్ కేర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!