సుల్తానాబాద్ పట్టణం లో బంద్ విజయవంతం
సుల్తానాబాద్,ఆగస్టు16(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో హిందూ ఐక్యవేదిక అధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై చేస్తున్న దాడులను ఖండిస్తూ బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావం తెలియజేస్తూ సుల్తానాబాద్ పట్టణ బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగింది.
ఈ మేరకు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం పండుగా ఉన్నా కూడా ఉదయం నుండి స్వచ్చందంగా వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, మార్కెట్, హోటళ్లు, సినిమా హాల్లు, స్కూల్స్, కాలేజ్, పెట్రోల్ బంక్ లు అన్ని రకాల వ్యాపార సంస్థలు సుల్తానాబాద్ పట్టణ బంద్ చేసి కార్యక్రమానికి సహకరించండం జరిగింది. ఈ సందర్భముగా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న మరణ కాండ వెంటనే ఆపివేయాలని, భవిష్యత్తు తరాలకు కాపాడుకోవాలంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసా మన వరకు రాకూడదు అంటే మనమందరం ఐక్యంగా ఉండాలని కోరడం జరిగింది. సుల్తానాబాద్ పట్టణం బంద్ కార్యక్రమంలో హిందూ భాందవులు అన్ని పార్టీలకు అతీతంగా సామాజిక కార్యకర్తలు, బిజెపి, ఎబివిపి, మైనార్టీ నాయకులు, దుకాణా వ్యాపారులు బంద్ కార్యక్రమంలో స్వచ్చందముగా పాల్గొని హిందూ ఐక్యతని చాటడం జరిగింది.