Tuesday, December 3, 2024
Homeతెలంగాణవైభవంగా గోదా తిరునక్షత్ర వేడుకలు 

వైభవంగా గోదా తిరునక్షత్ర వేడుకలు 

వైభవంగా గోదా తిరునక్షత్ర వేడుకలు 

సుల్తానాబాద్,ఆగస్టు7(కలం శ్రీ న్యూస్):

ఆండాళ్, గోదాదేవి తిరునక్షత్ర పర్వదినం ను పురస్కరించుకొని స్థానిక శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గోదా అమ్మ వారికి విశేషాలంకార లతో పాటు, పలు రకాల పుష్పాలతో అభిషేకాలు నిర్వహించారు. ద్రావిడ ప్రబంధ సేవా కాలం నిర్వహించారు. ఆలయంలో భక్తులు, వికాస తరంగిణి శాఖ ఆధ్వర్యంలో గోదా, కృష్ణ అష్టోత్తర నామాల పారాయణం చేశారు. అలాగే సామూహిక విష్ణు సహస్రనామాలను పారాయణం చేశారు. అనంతరం గోదా అమ్మవారికి మహిళలు సారే సంబంధించిన ఆడంబరాలను పూర్తి చేశారు. కొత్త బట్టలను, గాజులను, పసుపు, కుంకుమలను , కట్న కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ అర్చకులు సౌమిత్రి, శ్రావణ్ కుమార్, వికాస తరంగిణి సుల్తానాబాద్ శాఖ చీఫ్ కోఆర్డినేటర్ సాదుల సుగుణాకర్ మాట్లాడుతూ ఆండాళ్ దేవి అవతరణ వివరాలను,  గోదా అమ్మవారు తులసి వనంలో విష్ణు చితుల వారికి అయోనిజగా దొరికిన సంఘటన సంబంధించి కథనం వివరిస్తూ, లోకానికి గోదాదేవి అందించిన తిరుప్పావై పాశురాల వైభవాన్ని వివరించారు. మహిళలు భక్తులు గోదా అమ్మవారికి సంబంధించిన సారే పూజ ద్రవ్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో హరిణి,వికాస తరంగిణి బాధ్యులు పొన్నమనెని స్వరూప బాలాజీ రావు, పల్లా సదా లక్ష్మి, సాదుల సునిత, మంజుల,పల్లా సౌమ్య, పొడిల్ల రమేష్, వనజ,అన్నపూర్ణ, లక్ష్మి,లత, గౌరీ, కళ, అల్లాడి భగవాన్, సరోజ, రమ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!