న్యాయవాదుల విధుల బహిష్కరణ
సుల్తానాబాద్,ఆగస్టు7(కలం శ్రీ న్యూస్):
న్యాయవాద దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా తెలంగాణ అడ్వకేట్ జేఏసీ పిలుపు మేరకు సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు మాట్లాడుతూ ఓ కేసు విషయంలో జనగామ బార్ అసోసియేషన్ సభ్యులు గద్దల అమృతరావ్, ఆయన సతీమణి గద్దల కవిత లు జనగామ పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడి పోలీసులు న్యాయవాద దంపతులపై అమానుష పదజాలంతో తిట్టి, వారిపై దాడి చేయడం, అలాగే కోర్టు ఆర్డర్లను అమలు చేయడంలో సిరిసిల్ల పోలీస్ ప్రదర్శించిన అలసత్వానికి, నిర్లక్ష్యానికి నిరసనగా న్యాయవాదులు విధులను బహిష్కరించినట్లు తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.