సుల్తానాబాద్ కోర్టు జడ్జిగా గణేష్
సుల్తానాబాద్,ఆగష్టు7(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మున్షిప్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా దుర్గం గణేష్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గోదావరిఖని కోర్టు నుండి సుల్తానాబాద్ కోర్టుకు బదలీపై వచ్చిన గణేష్ కు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు ఆయనకు స్వాగతం పలికి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్ తో పాటు ఏపీపీ శ్యాం ప్రసాద్, ఏజిపి ఆవుల లక్ష్మీరాజంతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.