చేనేత కార్మికులకు మంచి రోజులు రానున్నాయి
పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
సుల్తానాబాద్,ఆగస్టు7(కలం శ్రీ న్యూస్):
చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం లో మంచి రోజులు రానున్నాయని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి ,ఉపాధ్యక్షులు సాయిరి మహేందర్ ఆన్నారు. మున్సిపల్ పరిధిలోని గాంధీ నగర్ లో గల శ్రీనివాస చేనేత సహకార సొసైటీ నందు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేర్గు యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వేముల రామ్మూర్తి ,ఉపాధ్యక్షులు సాయిరి మహేందర్ పాల్గొని కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం చేనేత కార్మికులు, మహిళ చేనేత కార్మికురాళ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత నూలు వస్త్రాలపై కేంద్రం జీఎస్టీ ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ సొసైటీ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సంబంధిత మంత్రులు అధికారులతో మాట్లాడి త్వరలోనే సుల్తానాబాద్ లోని గాంధీనగర్ చేనేత సొసైటీని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎంతోమంది చేనేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం చేనేత కార్మికులపై ప్రత్యేక చర్యలు తీసుకొని వారి అభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంతోమంది గ్రామాల్లో చిన్న వ్యాపారులు సైకిళ్లపై బట్టలు పెట్టుకొని అమ్ముతున్న వారికి ద్విచక్ర వాహనాలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత సొసైటీ కి సంబంధం లేకుండా 52 ఏళ్ళు నిండిన పద్మశాలి కులస్తులకు పింఛన్లు ఇచ్చేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుండ మురళి ,చిప్ప భాస్కర్, గాదాసు రవి, సామల హరికృష్ణ, తుమ్మ రాములు, సామల రాజేంద్రప్రసాద్, గుండ లక్ష్మీనారాయణ, సుంక చంద్రయ్య, కామని వెంకటరమణ, ఎలిగేటి రమేష్, కామని రాజేంద్రప్రసాద్, దూడం లింగమూర్తి, జంజీరాల లక్ష్మణ్, సుంక శ్రీధర్, కుర్మ అరుణ్, ఎల్లే శివ, సుంక మహేష్, కార్మికులు గోలి పద్మ, దాసరి శాంతమ్మ, బండి శాంతమ్మ , రంగమ్మ, శోభ చంద్రమౌళి, చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.