Friday, November 8, 2024
Homeతెలంగాణపుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ బహూకరణ

పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ బహూకరణ

పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ బహూకరణ

సుల్తానాబాద్,ఆగష్టు01(కలం శ్రీ న్యూస్):

లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో గురువారం పూర్వ అధ్యక్షులు దీకొండ భూమేష్ కుమార్ వారి కుమారుడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలకు 2 వాటర్ క్యాన్లు, 50 మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్ తోపాటు చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మహేందర్ సంతోషం వ్యక్తపరుస్తూ లయన్స్ క్లబ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కో-ఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, కోడూరి సతీష్ కుమార్, కట్ల సంపత్, తూర్పాటి భార్గవ్ కృష్ణ, ఆడెపు పాండురంగ అధ్యాపకులు గుండ రవీందర్, ఆడెపు సదయ్య విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!