హైదరాబాద్ తరలి వెళ్లిన పద్మశాలి సంఘం నాయకులు
సుల్తానాబాద్,జులై29(కలం శ్రీ న్యూస్):
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు ఆగస్టు 18న నిర్వహించనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వల్లకాటి రాజకుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయనకు మద్దతుగా పెద్దపెల్లి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి అయిల రమేష్, ఉపాధ్యక్షుడు సాయిరి మహేందర్ ల ఆదేశాల మేరకు యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు యాదగిరి ఆధ్వర్యంలో జిల్లా సంఘం నాయకులు సోమవారం హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు రాష్ట్ర సంఘం నాయకులు మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రభుత్వ పరంగా పద్మశాలీలకు చెందాల్సిన సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని, చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంఘటితంగా పోరాడి పద్మశాలీల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం నాయకులు సామల రాజేంద్రప్రసాద్, దూడం ఆంజనేయులు, అడిచెర్ల స్వతంత్ర్య కుమార్, చిలువేరు సంపత్, మోర మనోహర్, వేముల చిరంజీవి పాల్గొన్నారు.