Thursday, October 10, 2024
Homeతెలంగాణఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే జీవన మనుగడ  

ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే జీవన మనుగడ  

ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే జీవన మనుగడ  

ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి

సుల్తానాబాద్,జులై 24(కలం శ్రీ న్యూస్):

నిత్యం మనం పోషకాలతో ఉన్న ఆహారం తీసుకుంటేనే జీవన మనుగడ కొనసాగుతుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం సుల్తానాబాద్ లోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులకు హెల్తీ ఫుడ్, ఆన్ హెల్తీఫుడ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మన పూర్వీకులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వందేళ్లు జీవించారని, ఈ కాలంలో కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ఆయుషు తగ్గిపోతుందన్నారు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మానవ మనుగడకు ప్రమాదం తప్పదన్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే పౌష్టికాహారం తీసుకోవడం వలన కలిగే లాభాలు, అన్ హెల్తి ఫుడ్ తీసుకోవడం వల్ల జరిగే నష్టాలను విద్యార్థులకు వివరించడంతో విద్యార్థుల్లో చైతన్యం వెళ్లి విరుస్తుందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు తీసుకునే పౌష్టికాహారంతో ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అన్నారు. విద్యార్థులు ఎక్కువగా జంక్ ఫుడ్ లకు అలవాటు పడుతూ తమ ఆరోగ్యాలను కాపాడుకోలేక అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది విద్యార్థులు చిన్నతనంలోనే కళ్లద్దాలను వాడుతున్నారని, ఉబకాయంతో ఎంతోమంది విద్యార్థులు బాధపడుతున్న సంఘటనలు రోజురోజుకు పెరిగి పోతున్నారని తెలిపారు. మనం తీసుకునే ఆహారం విషయంలో ప్రజలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు విద్యార్థులకు రోజూ అరటి పండ్లు, గుడ్లు, పాలు వంటి పోషక పదార్థాలను అందించాలని కుర్కురేలు ఐస్ క్రీములు, చాక్లెట్లతో పాటు జంక్ ఫుడ్ లకు దూరంగా ఉంచాలని కోరారు. అనంతరం విద్యార్థులు వివిధ వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నరేందర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!