Wednesday, December 4, 2024
Homeతెలంగాణఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

సుల్తానాబాద్, జులై 24 ( కలం శ్రీ న్యూస్): యువతకు స్ఫూర్తి యువ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అని సుల్తానాబాద్ మాజీ ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మాజీ ఎంపీటీసీ సూరా శ్యామ్ లు అన్నారు. బుదవారం మండల కేంద్రంలోని నెహ్రూ విగ్రహం వద్ద మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సారధ్యంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించిన యువ డైనమిక్ లీడర్ కే.టీ.ఆర్ అని, యువతకు స్ఫూర్తిగా నిలిచి అనేక ఐటి పరిశ్రమలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేసిన మహోన్నత నేత అని కొనియాడారు. వేల కోట్ల రూపాయలతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలని సంకల్పంతో, పరిశ్రమలను నెలకొల్పారని అంతేకాకుండా తండ్రికి తగ్గ తనయుడిగా రాణించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి అని, ప్రపంచ దేశాలను సైతం మెప్పించి తెలంగాణకు పరిశ్రమలను తెచ్చిన నేత అన్నారు. ముందు ముందు యువతకు స్ఫూర్తిగా నిలిచి రానున్న రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటున అందించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, మాజీ ఎంపీపీ పాల రామా రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు పారుపెల్లి గుణపతి, రేవెల్లి తిరుపతి, పసిడ్ల సంపత్, శీలం శంకర్, గొట్టం మహేష్, సాజిద్, మమ్మద్ రఫీక్,బోయిని రాజమల్లయ్య, గందే మల్లికార్జున్, సతీష్, ఆరపల్లి రాకేష్, కాంపల్లి రాజు, బైరగోని ప్రభాకర్ గౌడ్, లతోపాటు పెద్ద సంఖ్యలో బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!