వర్షా కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై శ్రావణ్ కుమార్
సుల్తానాబాద్,జులై,20(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మానేరు పరిసర ప్రాంత గ్రామాలైన గొల్లపల్లి,గర్రేపల్లి,బొంతకుంటపల్లి,నీరుకుల్లా,గట్టేపల్లి,కదంబాపూర్, తొగర్రాయి,మంచిరామి లతో మిగతా గ్రామాల చెరువుల మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని, గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రవణ్ కుమార్, సూచించారు. శనివారం మండలంలోని పలు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. నిండుగా ప్రవహిస్తున్న మానేరు వాగు తో పాటు చెరువులు కుంటలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల నీరు నిలిచిన గుంతల వద్ద జాగ్రత్తలు పాటించాలని, నీటి అడుగున గుంత లోతు ఎక్కువ ఉండటం వల్ల గానీ, భూమి తడిసి మెత్తగా ఉండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి వద్ద, పని ప్రదేశాల్లో కరెంట్ వైర్లతో, తడిసిన స్విచ్ బోర్డు లతో జాగ్రత్తగా ఉండాలని, వర్షంతో గోడలు తడిసి ఉండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని, నిత్యం మీరు గమనించే పరిసరాలే అయినా.వానలు పడుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా బర్ల కాపర్లు, జాలర్లు ఎట్టి పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించ వద్దని సూచించారు. రైతులు వ్యవసాయ బావులు, కుంటలను జాగ్రత్తగా పరిశీలించి వ్యవహరించాలని సూచించారు. అవసరం ఉంటే తప్ప వర్షంలో బయటకి రావద్దని కోరారు. వర్షా కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ప్రజలందరూ సహకరించాలని అన్నారు.ఇంకా రానున్న రెండు మూడురోజులు బారీగా వర్షం కురిషే అవకాశం ఉందని పేర్కొన్నారు.