వర్షం నీటితో ఇబ్బందులు ఎదురైతే సమాచారం అందించండి
మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు
సుల్తానాబాద్,జులై20(కలం శ్రీ న్యూస్):
వర్షం నీరు రోడ్డు పైకి చేరి రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో తక్షణమే మున్సిపల్ చైన్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు హుటాహుటిన వర్షపు నీరును దారి మళ్లించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ లో రోడ్లు జలమయం కావడంతో తక్షణమే చైర్ పర్సన్ చేరుకొని జెసిబి సహాయంతో రోడ్డుపై ఉన్న నీరును ప్రక్కల కు కచ్చా ట్రైన్ తీసి నీరు రోడ్డుపై నిలువకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా రహదారులపై, అలాగే కాలనీలలో ఇండ్లకు నీరు చేరితే తక్షణమే మున్సిపల్ కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. వర్షంలో ప్రజలు ఎవ్వరు ఇబ్బందులు ఎదుర్కోవద్దని ,ముందస్తు చర్యలు చేపడుతున్నామని, వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వివిధ రకాల రుగ్మతలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మంచినీరు విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలని, శిధిలావస్థకు చేరిన ఇండ్లలో ఎవరు నివసించవద్దని, వర్షాల కారణంగా అవి కూలిపోయే ప్రమాదం ఉంటుందని సూచించారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ కట్ల వేణుమాధవ్ తో పాటు సిబ్బంది పలువురు పాల్గొన్నారు.