సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వైద్యురాలు ఫరహ మఖ్ నూన్
సుల్తానాబాద్, జులై19(కలం శ్రీ న్యూస్): సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటి నిలువలు ఇంటి ఆవరణలో లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యురాలు ఫరహ మఖ్ నూన్ అన్నారు. శుక్రవారం మండలంలోని కాట్నపల్లి గ్రామంలో గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు అనుదీప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా వైద్యురాలు ఫరహ మఖ్ నూన్ వైద్య సిబ్బంది హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, దాదాపు 86 మంది ప్రజలకు వివిధ రకాల పరీక్షలను నిర్వహించి, అవసరం ఉన్నవారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అంతేకాకుండా ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శంకర్, సూపర్ వైజర్ వెంకట్ రెడ్డి, ఏఎన్ఎంలు కవిత, భారతి, ఆశా కార్యకర్తలు విజయలక్ష్మి, లావణ్య, అంగన్ వాడి కార్యకర్తలు కనక లక్ష్మి, స్వప్న, గ్రామపంచాయతీ కారోబార్ వెంకటేశ్వర్లు తోపాటు తదితరులు పాల్గొన్నారు.