మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు కృతజ్ఞతల వెల్లువ
మంథని, జులై 19(కలం శ్రీ న్యూస్)
హైదరాబాద్ లోని అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో పేర్కొన్న ఆరు గ్యారంటీ పథకాల్లో ఒకటైన రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని ప్రారంభించి మొదటి విడతగా లక్ష లోపు బకాయిలు ఉన్న దాదాపు 11.08 లక్షల మంది రైతులకు 6,098 కోట్ల రూపాయలను మాఫీ చేసిన శుభ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో చైర్మన్,రాష్ట్ర ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని శుక్రవారం కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి అభినందనలు,శుభాకాంక్షలు తెలిపిన జాతీయ వికలాంగుల నెట్వర్క్ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు,న్యాయవాది ఇనుముల సతీష్.