Friday, November 8, 2024
Homeతెలంగాణమీరు చేసిన దోపిడి పనులే అందరూ చేస్తారనుకోవడం అవివేకం

మీరు చేసిన దోపిడి పనులే అందరూ చేస్తారనుకోవడం అవివేకం

మీరు చేసిన దోపిడి పనులే అందరూ చేస్తారనుకోవడం అవివేకం

మున్సిపల్ చైర్మన్ రమా సురేష్ రెడ్డి.

మంథని,జులై17(కలం శ్రీ న్యూస్):

టిఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్ట మధుకర్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆయన సోదరులు శ్రీనుబాబు లపై, మున్సిపల్ చైర్మన్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ మున్సిపల్ చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తాము గతంలో చేసిన దోపిడీల ను ప్రస్తుతం శ్రీధర్ బాబు  కొనసాగిస్తున్నారని అనుకోవడం వారి అవివేకానికి నిదర్శనమని, తమ ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి పనులకు తాము తమ నాయకులు ఎవరు అడ్డుపడరని చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి పుట్ట మధు మాట్లాడుతున్నారని విమర్శించారు. మంథని నుండి గెలిచిన వ్యక్తి శ్రీధర్ బాబు ఒక్కరే అయినప్పటికీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో మంథని ప్రాంత ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యాలను కలిగినా శీను బాబు  ద్వారా నిత్యం అందుబాటులో ఇద్దరు నాయకులు సేవ చేస్తున్నారని, అటువంటి ప్రజా సేవ చేసే నాయకులపై విమర్శలు చేస్తే రాజకీయ పుట్టగతులు ఉండవని, తాము స్థానికులం కాదంటూ చేసిన ఆరోపణలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము పుట్టి పెరిగిన ప్రాంతం, చదువుకున్న ప్రాంతం సైతం మంథని అని,  మా యొక్క స్థానికత విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే పుట్ట మధు వారి సతీమణి పుట్ట శైలజని అడిగి తెలుసుకోవాలని సూచించారు.అభివృద్ధి పనులు అక్రమాలకు పాల్పడే చరిత్ర తమ నాయకులది, తమ పార్టీ శ్రేణులది కాదని, ఆ అలవాటు గతంలో ఉంది గనుక పచ్చకామర్ల వాళ్లకి లోకమంతా పచ్చగా కనబడినట్లు అగుపిస్తుందని, ఇకనైనా ఇటువంటి చౌకబారు ఆరోపణలు మానుకొని తమ పనులు తాము చూసుకుంటే మంచిదని హితవు పలికారు.

పుట్ట మధు ప్రజల్లో కనుమవుతున్న విషయాన్ని తెలుసుకొని నిత్యం వార్తల్లో కనబడాలని ఉద్దేశంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఆరోపణలు చేయడం కాదని,ఆధారాలతో బయటపెట్టాలని లేనిపక్షంలో ప్రజల నుంచి చీత్కారాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య తో పాటు స్థానిక కౌన్సిలర్లు చొప్పకట్ల హనుమంతు, వి కే రవి, గుండా విజయలక్ష్మి పాపారావు, నక్క నాగేంద్ర శంకర్, కొట్టే పద్మా రమేష్, వేముల లక్ష్మి సమ్మయ్య తోపాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!