Wednesday, December 4, 2024
Homeతెలంగాణగంజాయి విక్రయదారుడు అరెస్టు

గంజాయి విక్రయదారుడు అరెస్టు

గంజాయి విక్రయదారుడు అరెస్టు

సుల్తానాబాద్,జులై14(కలం శ్రీ న్యూస్):

చంద్రాపూర్ నుండి గంజాయి విక్రయించి తీసుకొచ్చి సుల్తానాబాద్ లో సప్లై చేస్తున్న వ్యక్తి నుండి 271 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న సుల్తానాబాద్ పోలీసులు. ఎస్ ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలో భాగంగా సుల్తానాబాద్ పూసాల రోడ్డులో తనిఖీ చేయగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక స్కూటీ ని గమనించి విచారించగా స్కూటీ లో గంజాయి లభించింది. పంచాయతీ సెక్రటరీ లు ప్రమోద్ కుమార్, పాపయ్య లు ఎస్సై శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి వ్యక్తిని విచారించగా నిందితుడు చంద్రాపూర్ నుండి గంజాయి విక్రయించి తీసుకొచ్చి సుల్తానాబాద్ లో సప్లై చేస్తున్నట్టుగా అంగీకరించాడని, నిందితుడు దగ్గర రైల్వే టికెట్, బస్సు టికెట్, మొబైల్ ఫోను, బైక్, 271 గ్రాముల గంజాయి లభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తిరుపతి, కానిస్టేబుల్ రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!