సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు.
పెద్దపల్లి,జులై10(కలం శ్రీ న్యూస్):
సీజనల్ వ్యాధులు నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామస్థులు గ్రామాల్లో జ్వరాలు ప్రబాలుతున్నాయని మంగళవారం ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించి వైద్య, పీఆర్ అధికారులతో కలిసి బుధవారం గ్రామాన్ని సందర్శించారు. ప్రజలకు విష జ్వరాలు రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకుని వైద్యులతో మాట్లాడి నియంత్రణకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో వార్డుల్లో పర్యటించి జ్వర పీడితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా రోగాలు దూరమవుతాయని తెలిపారు. ప్రజలు డాక్టర్ల సూచనలు పాటించాలని, ఇంటి పరిసరాలలో వృధా, వర్షం నీరు నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పంచాయితీ అధికారులు పారిశుధ్యం, తాగునీటి క్లోరినేషన్ పై దృష్టిసారించాలని ఆదేశించారు. వ్యాధులు సోకినట్లు అనుమానితులుంటే వెంటనే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే విజయరమణ రావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, ఎంపిడిఓ శ్రీనివాస్, ఎంపిఓ సుదర్శన్, నూగిల్ల మల్లయ్య, సందనవేన రాజేందర్, మాజీ జడ్పీటిసి బండారి రాంమూర్తి, బూతగడ్డ సంపత్, కట్కూరి సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్, నాయకులు కొమ్ము అభిలాష్, దొడ్డుపల్లి జగదీష్, కరుణాకర్, పోసాని మల్లేష్, సాగర్, శరత్ గజ్జెల కనకయ్య, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్య అధికారులు, అశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.