22 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్
సుల్తానాబాద్, జూలై 9(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు.మంగళవారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ సుల్తానాబాద్ మండలంలో పలు గ్రామాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ,ఐతరాజ్ పల్లి గ్రామంలో యార్ల మల్లయ్య ఇంటి వద్ద ఆటోలో తరలించడానికి సిద్ధంగా ఉన్న 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తనిఖీల్లో పట్టుకోవడం జరిగిందని అన్నారు. సదరు రేషన్ బియ్యాన్ని పెద్దపల్లి ఎం.ఎల్.ఎస్ పాయింట్ కు తరలించామని అన్నారు.
యార్ల మల్లయ్యపై ప్రజా పంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వులు 2016 ప్రకారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.ఈ తనిఖీలలో ఎన్ ఫోర్స్ మెంట్ సంబంధిత అధికారులు తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు.