విద్యార్థులకు బెల్ట్ లు, పెన్నులు పంపిణీ చేసిన లోకే సోదరులు
మంథని,జులై9(కలం శ్రీ న్యూస్):
మంథని పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు మంగళవారం దివంగత లోకే రాము జయంతిని పురస్కరించుకొని పాఠశాలలోని అందరు విద్యార్థిని, విద్యార్థులకు బెల్టులు, పెన్నులు, ఇతర ఉపయోగకర వస్తువులు అందజేశారు. ఎంతో ఉదార స్వభావం కలిగిన లోకే మనోహర్, లోకే శరత్ లు తమ్ముడు లోకే రాము జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేద విద్యార్థులకు సహాయం చేయడం, ఆసుపత్రిలో ఉన్నటువంటి వారికి సహకరించడం, అలాగే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎందరో కరోనా బారిన పడిన బాధితులకు లోకి మనోహర్ లోకి శరత్ లు బాసటగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. పిన్న వయసులో కరోనా సమయంలో మృతి చెందిన రాము జ్ఞాపకార్థం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోసం శ్రీనివాస్ మాట్లాడుతూ లోకే మనోహర్, లోకే శరత్ లాంటి దాతల సహకారంతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. వీరి ఉదార స్వభావానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యుడు టక్కేగారి రాధాకృష్ణ, పాత్రికేయుడు మహావాది సతీష్ కుమార్ తో పాటు ఉపాధ్యాయులు బి వనిత, పి ఉమా, బి శంకర్, ఎం సుమలత, ఎస్ శ్రీనివాస్, టి శారద, వై నందు, కే శ్రీనివాస్, ఏ రాజేందర్, అవదానుల మాధురి, బి రమణ, జి ఉమా లు పాల్గొన్నారు.