Thursday, October 10, 2024
Homeతెలంగాణఘనంగా 76వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

ఘనంగా 76వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

ఘనంగా 76వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

సుల్తానాబాద్,జులై9(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా 76వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా కరీంనగర్ హాస్టల్స్ కన్వీనర్ రాసురి ప్రవీణ్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 1949 జులై 9న ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమై, జాతీయవాద సిద్ధాంతాలతో ఎంతోమంది విద్యార్థులను జ్ఞాన శీల ఏకత సాధనలకై, జాతీయ పునః నిర్మాణం కోసం పనిచేస్తున్న విద్యార్థి సంఘం అని అన్నారు. విద్యారంగ సమస్యలను ఎత్తిచూపుతూ విద్యార్థుల గొంతుక గా మారి ఎన్నో ఉద్యమాలు నిర్వహించిందని, నేటికీ 76 వసంతాలు పూర్తిచేసుకుని అతిపెద్ద విద్యార్థి సంఘంగా నేడు ప్రపంచవ్యాప్తంగా అవతరించిందని, పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రతి ఒక్క విద్యార్థిని జాతీయ భావ సిద్ధాంతాల వైపు నడిపిస్తూ దేశ హితం కోసం పనిచేస్తున్న విద్యార్థి సంఘం ఏబీవీపీ అని కొనియాడారు. కేవలం 5 మందితో మొదలైన జాతీయవాద భావాలతో విద్యార్థుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని అన్నారు.అలాగే విద్యార్థి పరిషత్ ఆవిర్భావం రోజునే జాతీయ విద్యార్థి దినోత్సవం గా జరుపుకుంటామని, పూర్వ, ప్రస్తుత విద్యార్థి పరిషత్ సభ్యులకు జాతీయవాద విద్యార్థి కుటుంబసభ్యులకు 76వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం, జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ రాసూరి ప్రవీణ్, ఎస్.ఎఫ్.డి జిల్లా కన్వీనర్ రిషి,మెరుగు సిద్ధార్థ, వినయ్, నిశాంత్, సిద్ధార్థ, సంపత్,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!